చిరంజీవి గారి వల్లే మాకు న్యాయం జరుగుతుంది.- డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ▪️ రఘు మాస్టర్‌ కార్యవర్గం ఎన్నిక చెల్లదు ▪️ విడదీయాలని చూస్తే లాగి కొడతాం ▪️ ఫిల్మ్ ఛాంబర్, చిరంజీవి గారే పరిష్కరించాలి

తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కొందరు రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చెల్లదు అని, తాము ఆ కార్యవర్గాన్ని గుర్తించడం లేదని సుమలత అన్నారు. తమకు ఎలాంటి అధికారిక న్యాయపరమైన నోటీసు ఇవ్వకుండా మరో వర్గం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చట్టబద్ధం కాదన్నారు. రఘు మాస్టర్‌ వర్గం ప్రకటించిన కొత్త కార్యవర్గంపై సుమలత దేవి తీవ్రస్థాయిలో స్పందించారు....