చెరువులోకి దూసుకెళ్లిన కారు… ఐదుగురి మృతి
భువనేశ్వర్,అర్జున్ సమాచారం: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మహిషాపుటా వద్ద గురువారం ఓ పెళ్లి బృందం కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే, అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊపిరాడక మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని దేంకానాల్ ఆసుపత్రికి తరలించారు. మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్, అవినాష్ సాహు, అభిషేక్ సాహు, రాకేశ్ సాహు, రామ్ సాహులుగా గుర్తించారు....