చేనేతలను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే: గంగుల కమలాకర్

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన చేనేత పారిశ్రామిక, సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, చేనేత రంగాన్ని బలోపేతం చేయడం, నేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పండుగల సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ బాధ్యతలను అప్పటి...