జనాభాతో సంబంధం లేకుండానే డీలిమిటేషన్.. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు? – అన్ని రాష్ట్రాల్లో 50 శాతం లోక్సభ స్థానాల పెంపునకు యోచన – జనాభా లెక్కల వివాదాలకు తావు లేకుండా పరిష్కారం చూపే యత్నం – రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి యథాతథంగా కొనసాగే అవకాశం – మహిళా రిజర్వేషన్లను వేగంగా అమలు చేసేందుకే మార్గం – కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత అధికారిక ప్రకటనకు అవకాశం
అర్జున్ సమాచారం: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసే దిశగా సాగుతోంది. జనాభా లెక్కల (సెన్సస్)తో సంబంధం లేకుండానే ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను ఏకరీతిగా 50 శాతం మేర పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గ భేటీలో చర్చించి అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశముంది. సాధారణంగా డీలిమిటేషన్ చేపట్టాలంటే తాజా జనాభా లెక్కలే ప్రామాణికం. కానీ కొత్త సెన్సస్ పూర్తయ్యే వరకు...