అర్జున్ సమాచారం:
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పనిలేకుండా ఆన్లైన్ సేవలు సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీని కోసం ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్‌చైన్ వంటి సాంకేతికతలను వినియోగించుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.
ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సేవలు అందించాలన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరు, పురోగతిపై సమీక్ష చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1204 సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.. ఈ సేవలకు సంబందించిన డేటా ఎంట్రీ సమాచారాన్ని సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయకుండా డేటా ఇంటిగ్రేషన్ చేయాలని సూచించారు.
==========================