జలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అర్జున్ సమాచారం: ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పనిలేకుండా ఆన్‌లైన్ సేవలు సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీని కోసం ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్‌చైన్‌ వంటి సాంకేతికతలను వినియోగించుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సేవలు అందించాలన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరు, పురోగతిపై సమీక్ష చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1204 సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.....