జవహర్ నగర్ డంప్ యార్డ్ బాధితులకు ఎంపి ఈటల సంఘీభావం

సికింద్రాబాద్,అర్జున్ సమాచారం: జవహర్ నగర్ డంప్ యార్డ్ వ్యతిరేక పోరాట అఖిలపక్ష నేతలు, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు బుధవారం నాడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్  మర్యాదపూర్వకంగా కలిసారు.  జవహర్ నగర్ డంప్ యార్డ్కు వ్యతిరేకంగా తాము చేస్తున్న సుదీర్ఘ ఆందోళనకు పార్టీలకు అతీతంగా నాయకత్వం వహించాలని వారు ఈ సందర్భంగా ఎంపీ ఈటలను కోరారు.  20 ఏళ్లుగా తాము చెత్త కుప్పల మధ్య, కాలుష్య కోరల్లో నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని స్థానికులు ఎంపీ ఈటల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు....