జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,అర్జున్ సమాచారం: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day) సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన చిన్నారికి చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా అల్బెండాజోల్ మాత్రలు అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకటి నుంచి 19 సంవత్సరాల...