జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: జిల్లా కలెక్టర్

కరీంనగర్,అర్జున్ సమాచారం: జాతీయ రహదారుల పై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించేందుకు రవాణా, పోలీస్, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో  తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, రవాణా, ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులు సమన్వయంతో రహదారుల...