జాతీయ సంఘాల వైఫల్యంతోనే సింగరేణి కార్మికులకు కష్టాలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి చేయలేని వైఫల్యం లాభాలలో వాటాను కార్మికులకు దసరా లోపే చెల్లించాలి. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

కమాన్ పూర్,అర్జున్ సమాచారం: సింగరేణిలో జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టియుసి యూనియన్ల వైఫల్యం కారణంగానే కార్మికులు బొగ్గు ఉత్పత్తి, కార్మిక సంక్షేమం, వైద్యం తదితర అన్ని అంశాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రామగిరి మండలం సెంట్రింగ్ కాలనీ ఆర్జీ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వద్ద టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య ఫిట్ సెక్రెటరీ వివి గౌడ్, బ్రాంచ్ సెక్రటరీ తిప్పారపు తేజ నేతృత్వంలో గేట్...