జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం రాష్ట్రీయ హరిత గౌరవ పురస్కారానికి ఎంపికైన బాల ప్రకృతి ప్రేమికుడు – అవార్డు కోసం వెళ్లే ఖర్చుతో మొక్కలు నాటుతా.. అవార్డులు కాదు పచ్చదనమే పెంచడమే ముఖ్యం – తెలంగాణ బాల ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్
కొత్తగూడెం,అర్జున్ సమాచారం: పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తూ, చిన్న వయసులోనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ బాల ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ కు అరుదైన జాతీయ గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక "రాష్ట్రీయ హరిత గౌరవ పురస్కార్ 2026" కు ఎంపికయ్యాడు. రాజస్థాన్ కేంద్రంగా 40 ఏళ్లుగా పర్యావరణ సేవలో తలమునకలై, కోట్లాది మొక్కలు నాటి "ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా" గా పేరుగాంచిన శ్రీ విష్ణు లాంబా ఆధ్వర్యంలోని కల్పతరు సంస్థాన్ ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ నెల 27వ...