సంగారెడ్డి,అర్జున్ సమాచారం:
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సూచించారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, బ్రిడ్జిలపై నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించరాదని హెచ్చరించారు. నీటి ప్రవాహం తక్కువగా కనిపించినప్పటికీ దాని లోతు, వేగాన్ని అంచనా వేయడం కష్టమని, ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉంటుందని, కర్రెంట్ స్తంభాల వద్ద నీరు నిల్వ ఉండి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఎక్కువని, కర్రెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని,అన్నారు.
జిల్లాలో ప్రమాద అంచున ఉన్న ఆనకట్టలు, వాగులు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తతతో విధులు నిర్వహిస్తూ రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య, విద్యుత్, విపత్తు నిర్వహణ తదితర శాఖలతో సమన్వయతో పనిచేసి, ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ – 8712656739 నంబర్‌కు సమాచారం అందించాలని, జిల్లా ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండి తమ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి విజ్ఞప్తి చేశారు.
==============================