జిల్లాకు భారీ వర్ష సూచన, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పొంగుతున్న వాగులు, వంకలు, బ్రిడ్జ్ లపై నుండి దాటడానికి ప్రయత్నించకూడదు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు, ప్రయాణాలు వాయిదావేసుకోవాలి. ప్రమాద అంచున ఉన్న ఆనకట్టల వద్ద ప్రత్యేక బందోబస్తు, సూచిక బోర్డులను ఏర్పారు చేయాలి. పోలీసు అధికాలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలి అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712656739 నంబర్ ను సంప్రదించండి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి,
సంగారెడ్డి,అర్జున్ సమాచారం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సూచించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలు వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, బ్రిడ్జిలపై నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించరాదని హెచ్చరించారు. నీటి ప్రవాహం తక్కువగా కనిపించినప్పటికీ దాని లోతు, వేగాన్ని అంచనా వేయడం...