జిల్లా కలెక్టర్లకు రెడ్ క్రాస్ అవార్డులను అందజేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడ, సెప్టెంబర్ 01,అర్జున్ సమాచారం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ గౌరవ అధ్యక్షుడు  ఎస్ అబ్దుల్ నజీర్ మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఐఆర్‌సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమావేశంలో బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమగోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లకు రెడ్‌క్రాస్ అవార్డులను అందజేశారు. రెడ్‌క్రాస్ యొక్క వివిధ ప్రధాన మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలోనూ  విశిష్ట సహకారం అందించినందుకు జిల్లా కలెక్టర్లను గవర్నర్  అబ్దుల్ నజీర్ అభినందించారు.  రెడ్‌క్రాస్ అవార్డులు పొందిన...