వనపర్తి.
అర్జున్ సమాచారం:
అంతర్జాతీయవయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వయోవృద్ధులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల మోసపూరిత కాల్స్, మెసేజ్లు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. KYC అప్డేట్, ఆధార్ అప్డేట్ తదితర పేర్లతో ఫోన్ చేసి OTP చెప్పాలని అడగడం, వివిధ రకాల లింకులు పంపించి వాటిని ఓపెన్ చేయమని కోరడం వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, ATM/డెబిట్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు వివిధ వయస్సుల వారు సైబర్ నేరాలకు గురైన సందర్భాలు ఉన్నందున, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లు మరియు అనుమానాస్పద లింకులకు స్పందించకుండా, ముందుగా వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అనుమానాస్పద సైబర్ నేరాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో DCRB DSP బాలాజీ, DIO రాకేష్ రెడ్డి, DLSA కృష్ణయ్య, CDPO అమృతమ్మ, DWO సూపరింటెండెంట్ అరుంధతి, DWO సుధారాణి పాల్గొన్నారు. అలాగే SI అంజద్ ఆలీ
షీటీం సైబర్ SI రవి ప్రకాశ్ మరియు సైబర్ టీమ్ పాల్గొని వయోవృద్ధులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.
అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ — OTP చెప్పొద్దు, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దు.
===================