జిల్లా పోలీసు కార్యాలయంలో వయోవృద్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. వనపర్తి.
వనపర్తి. అర్జున్ సమాచారం: అంతర్జాతీయవయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వయోవృద్ధులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. KYC అప్‌డేట్, ఆధార్ అప్‌డేట్ తదితర పేర్లతో ఫోన్ చేసి OTP చెప్పాలని అడగడం, వివిధ రకాల లింకులు పంపించి వాటిని ఓపెన్ చేయమని కోరడం వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, ATM/డెబిట్ కార్డు...