ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 6:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సమస్యలు విన్నవించుకున్న 64 మంది అర్జిదారులు

బాపట్ల,అర్జున్ సమాచారం:
పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్  ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు.

జిల్లా ఎస్పీరు అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. తక్షణం సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి, చట్టపరిదిలో విచారించి, సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు మరలా మరలా పునరావృతం కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని తెలిపారు. అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు.

పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా  ఉంటుందనే భరోసాను జిల్లా ఎస్పీ  అర్జిదారులకు కల్పించారు. పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను చట్ట పరిధిలో విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు భూవివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, ఇతర పలు సమస్యలపై మొత్తం 64 అర్జీలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పి పి.జగదీష్ నాయక్, పిజిఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
=========================