జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సమస్యలు విన్నవించుకున్న 64 మంది అర్జిదారులు

బాపట్ల,అర్జున్ సమాచారం: పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్  ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా ఎస్పీరు అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. తక్షణం సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి, చట్టపరిదిలో విచారించి, సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు మరలా మరలా పునరావృతం కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని...