టాటాసుమోపై విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది మృతి ..

అర్జున్ సమాచారం: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉదయ్‌పూర్-కిలార్ రహదారిపై 'కడూ నాలా' వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో, మార్గమధ్యంలో వెళ్తున్న ఒక టాటా సుమో ధ్వంసమైంది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న 15 మందిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, మిగిలిన 13 మంది మరణించినట్లు స్థానిక మీడియా నివేదించింది. ఎమ్మెల్యే జనక్ రాజ్ ఈ దుర్ఘటనను ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...