ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 3:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 4వ రోజు మహా అన్న దానం.

టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 4వ రోజు మహా అన్న దానం.

మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 18.

ఈ రోజు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి మరియు టీఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు శ్రీమతి శ్రీ పొన్న స్వప్న మల్లయ్య పుణ్య దంపతులు ,శ్రీమతి శ్రీ హనుమాండ్ల విమల రాఘవరెడ్డి గారి పుణ్య దంపతుల గార్లచే 4 వ రోజు మహా అన్న దానం చేయడం జరిగినది. తదుపరి టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు టిఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు శ్రీమతి శ్రీ పొన్న స్వప్న మల్లయ్య గార్లు శ్రీ సిద్ది వినాయకుని పూజలు చేసి ప్రజలందరు బాగుండాలని , ఉద్యోగ ఉపాధ్యాయుల .పెన్షనర్ల సమస్యలన్నీ తొలిగిపోవాలని కోరుకుంటూ శ్రీ సిద్ధి వినాయకుని సిరిసిల్ల చేనేత కార్మికులు స్వయంగా నేసిన అగ్గిపెట్టలో పట్టు శాలువాను శ్రీ సిద్ధి వినాయకునికి బహుకరించడం జరిగినది.ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు జిల్లా లోని ప్రజలందరికీ ఉండాలని తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సమస్యలు అన్ని కూడా శ్రీ సిద్ధి వినాయక ఆశీస్సులతో తొందరలోనే పరిష్కారం కావాలని తెలుపడం జరిగినది. మరియు టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక మండలి లో నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్నదానం మరియు సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపడం జరిగినది. ముఖ్య అతిధులు కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు దేశ్ పాండే గారిని ,టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీమతిశ్రీ శ్రీపతి మంజుల బాపురావు గార్లను టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. తదుపరి టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస రావు దేశపాండే గారి మరియు సభ్యులు అందరూ కలిసి శ్రీమతి శ్రీ పొన్న స్వప్న మల్లయ్య .శ్రీమతి శ్రీ హనుమాండ్ల విమల రాఘవరెడ్డి గారి పుణ్య దంపతులను సమక్షంలో ఘనంగా సన్మానం చేయడం జరిగినది.  ముఖ్య అతిథి. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ హబీబ్ హుస్సేన్ గారు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్ష ,కార్యదర్శులు గుండేటి యోగేశ్వర్ గారు .కస్తూరి నాగేశ్వర్ గారు హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు గారు శ్రీపతి బాపురావు గారు సైoడ్ల మొండయ్య గారు బొడ్డు శ్రావణ్ కుమార్ గారు భూముల రామ్మోహన్ గారు సతీష్ కుమార్ గారు తిరుపతి రెడ్డి గారు సునీత గారు ఎన్. సత్యనారాయణ గారు టి.తిరుపతి గారు రాంకుమార్ గారు రాజేందర్ గారు బెక్కం ఉషన్నగారు టీఎన్జీవో కాలనీ నాయకులు,మహిళలు పాల్గొన్నారు.