టెట్ పై భయాందోళనలు వద్దు -టెట్ కోచింగ్ లో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్
బద్వేలు,అర్జున్ సమాచారం: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పై భయాందోళనలు వీడాలని యుటిఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బద్వేలు లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్సీటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 2028 ఆగస్టు 31 లోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి...