ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో రైతు మృతి.. ముత్తారంలో విషాదం

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 07: ముత్తారం మండల కేంద్రానికి చెందిన రైతు మారం వెంకట్ రెడ్డి మంగళవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం, గ్రామ సమీపంలోని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ సరిచేసే ప్రయత్నంలో 11 కేవీ విద్యుత్ సరఫరా ఉండటంతో ఆయనకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ...