ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్, అర్జున్ సమాచారం: హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నగరంలో ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపల్...