డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవిపై దాడి ▪️ *జనరల్ బాడీ సమావేశంలో ఉద్రిక్తత* ▪️ *చంపుతామని బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు*
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తోపులాట, కేకలతో ఫిల్మ్‌ఛాంబర్ ఆవరణ ఒక్కసారిగా రణరంగంగా మారిపోవడంతో తోటి సినీ కార్మికులు, పరిశ్రమ పెద్దలు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవిపై కొందరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారని, తనను చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందిరానగర్‌లోని రాఘవ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో...