డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాచలం,అర్జున్ సమాచారం: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో జరుగుతున్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్, క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ములకలపల్లి గ్రామంలో 160 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటివరకు 22 ఎకరాల సర్వే పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, భూసేకరణ సర్వేలో...