డీప్‌ఫేక్‌, ఆన్‌లైన్‌ వేధింపులకు అడ్డుకట్ట వెయ్యాలి : విష్ణు మంచు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కలకలం రేపిన కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన నకిలీ వీడియోల వ్యవహారంపై డైనమిక్ స్టార్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘చుట్టమల్లె’ పాటను కృత్రిమ మేధస్సుతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసిన ఘటనను కేవలం ఒక సంఘటనగా చూడకూడదని, అదుపులేని డిజిటల్ దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలకు ఇది హెచ్చరిక అని అన్నారు. రామ్ పోతినేని చేసిన ట్వీట్, “వాళ్లకు ముఖాలు లేవు.. అందుకే భయం...