డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారిపోతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు డెమోక్రాట్లు గెలిస్తే అన్ని నిర్ణయాలను వీటో చేస్తానన్న ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయాలని ఉందని వ్యాఖ్య రాజ్యాంగం ప్రకారం మూడోసారి ఎన్నిక కావడం సాధ్యం కాదని అంగీకారం తన సిబ్బందిపై విచారణలు జరిగితే ముందస్తు క్షమాభిక్షలు ఇస్తానని వెల్లడి డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నాయంటూ సర్వేలను తప్పుబట్టిన ట్రంప్
అర్జున్ సమాచారం: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే వారి ప్రతిపాదనలన్నింటినీ వీటో చేస్తానని హెచ్చరించారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, అయితే రాజ్యాంగ నిబంధనలు అందుకు అడ్డుగా ఉన్నాయని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ కాలమిస్ట్ మిరాండా డివైన్‌తో ‘పాడ్ ఫోర్స్ వన్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఓటమి...