డైలీ షటిల్స్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ఐటీ ఉద్యోగుల కోసం జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్లో "డైలీ షటిల్స్" సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, మరియు నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రజా రవాణాను బలోపేతం చేస్తోందన్నారు. ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, డైలీ షటిల్స్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ...