ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరం.. – పీఎం2.5 కాలుష్యానికి వాహనాలే ప్రధాన కారణమని గుర్తింపు – వాతావరణ మార్పులతో పేరుకుపోతున్న కాలుష్య కారకాలు – వారాంతంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం

అర్జున్ సమాచారం: ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శనివారం ఉదయం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 మార్కును మించడంతో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయం 6:51 గంటల సమయానికి ఏక్యూఐ 454గా నమోదైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కాలుష్య తీవ్రత అకస్మాత్తుగా పెరిగి, సూచీ 400 మార్కును అధిగమించింది. నవంబర్ 21న నమోదైన 449 తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. శుక్రవారం గాలి నాణ్యత 'పూర్' కేటగిరీలో (220-226 మధ్య)...