ఢిల్లీలో టెన్షన్…
న్యూఢల్లీ,జూలై 20,అర్జున్ సమాచారం: కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన చలో సంసద్ నిరసన ర్యాలీ మరింత ఉద్రిక్తంగా మారింది. ఉదయమే నిరసనకారులను జంతర్ మంతర్ వద్ద నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వాళ్లు ముందుకు సాగారు. పలు అంచెల్లో ఏర్పాటు చేసిన భద్రతను దాటుకొని మరీ దాదాపు పార్లమెంటు సమీపంలోకి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీఛార్జ్ కూడా చేశారు.ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని తోపులాట జరిగింది. దీంతో పలువురు నిరసనకారులతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. ఇదంతా...