ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నేతలు వణికిపోతున్నారు కేటీఆర్ ఘాటు విమర్శలు
అర్జున్ సమాచారం: కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ ఘాటు విమర్శలు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేస్తున్న పార్టీలేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ అయితే.. బీజేపీ చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అమిత్ షా హైదరాబాద్‌కు వస్తే బండి సంజయ్ బాడీగార్డ్‌లా వ్యవహరించారని కేటీఆర్ విమర్శించారు....