తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు రాయచోటి

రాయచోటి,అర్జున్ సమాచారం: తల్లిదండ్రులుమందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడిని రాయచోటి అర్బన్ పోలీసులు సకాలంలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో గంగమ్మ ఆలయం సమీపంలోనివాసముంటున్న జయరాములు తన కుమారుడు లోకేష్‌ను మందలించడంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాయచోటి అర్బన్ పోలీసులనుఆశ్రయించారు. అర్బన్ సీఐ వెంకట చలపతి ఆదేశాల మేరకు ఎస్‌ఐ చండ్రాయుడు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ బాలుడి కదలికలను గుర్తించారు. చివరకు...