త‌మిళ‌నాడు సీఎం కు లీగ‌ల్ నోటీసు

తిరుప‌తి,అర్జున్ సమాచారం": తిరుప్పరంకుండ్రం దీపం వివాదంపై తమిళనాడు సీఎం విజయ్‌కు లీగల్ నోటీసు జారీ అయింది.  టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి త‌న న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు.  సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ తమిళనాడు ప్రభుత్వంపై అభ్యంతరం వ్య క్తం చేసారు. నవంబర్ 20న సుప్రీం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. నవంబర్ 24న నిర్దేశిత దీపథూన్‌పై కార్తీక దీపం వెలిగించలేదని నోటీసులో ప్రస్తావించారు. దీపం వెలిగించకపోవడానికి కారణాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ===================