తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉంది హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్,అర్జున్ సమాచారం: కార్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి హైదరాబాద్ అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హ్యూందాయ్ ఇండియా సంస్థకు తెలిపారు. తెలంగాణలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి తో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్  చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. “భౌగోళికంగా తెలంగాణ దేశంలో మధ్య భాగంలో ఉంది. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ కాస్మోపాలిటన్...