‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సకల సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి 500 కొత్త వాహనాలు ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ప్రయోజనం

అమరావతి, జూలై 20,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం… గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సోమవారం  ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై...