ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:36 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తహశీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు మణుగూరు తహశీల్దార్ కార్యాలయం సిబ్బందికి సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ సూచనలు

భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
మణుగూరు తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి రెవెన్యూ సిబ్బంది పనితీరును, ప్రజలకు అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రెవెన్యూ అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులు, రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా వారి సమస్యలపై వెంటనే స్పందించాలని, పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలించి పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
కార్యాలయ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని, ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
==========================