తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత.. యాసంగిలో వరి సాగు చేయవద్దు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి స్పెషల్ చీఫ్ సెక్రటరీ బెనహుర్ మహేష్ దత్ ఎక్కా

కరీంనగర్,అర్జున్ సమాచారం: సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ యాసంగి సీజన్‌లో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రానున్న...