తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ లోఎల్ నినో ప్రభావంతో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మిషన్ భగీరథతో పాటు ఇతర తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో రోజువారీ నీటి...