తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు ప్రతి ఇంటికీ సురక్షిత నీరు.. ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమరజీవి జలధార లక్ష్యం రూ.30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రోద్దుటూరు, అర్జున్ సమాచారం: తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ లక్ష్యమని తెలిపారు. సోమవారం కడప...