తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని అన్నారు.

అర్జున్ సమాచారం: మా వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నాం. అగా ఖాన్ ఫౌండేషన్ కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించింది. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నాం. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న...