తాడిచెర్ల ఫేజ్-2 సింగరేణికి కేటాయింపు స్వాగతం మంథనిలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 08: మంథని నియోజకవర్గంలోని తాడిచెర్ల ఫేజ్-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడాన్ని స్వాగతిస్తూ బుధవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం చొరవతో ఈ కేటాయింపు సాధ్యమైందని పేర్కొంటూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ...