తార్నాకలో ఉద్రిక్తత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్
అర్జున్ సమాచారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు మంగళవారం తార్నాకలోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. సోమవారం నల్గొండలోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఆయన నల్గొండకు బయలుదేరేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రామచంద్రరావును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన అరెస్టును అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు రామచంద్రరావును అదుపులోకి తీసుకుని అక్కడి...