తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ మంత్రి షణ్ముగం, మంత్రి నారా లోకేశ్

అర్జున్ సమాచారం: తిరుమల శ్రీవారిని సింగపూర్ మంత్రి షణ్ముగం దర్శించుకున్నారు. సింగపూర్ మంత్రి వెంట ఏపీ మంత్రి నారా లోకేశ్‌‌ ఉన్నారు. షణ్ముగంతో కలిసి నారా లోకేశ్ సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి వెళ్లి శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవల్లో పాల్గొన్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేయగా...ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి...