తుడుం దెబ్బకు కొత్త నాయకత్వం.. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని నాయకుల హామీ
తాండూర్,అర్జున్ సమాచారం: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీతో పాటు ఆదివాసీ విద్యార్థి మండల కమిటీలను ఘనంగా నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివాసీ సమాజ ఐక్యతను బలోపేతం చేయడం, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సంస్థను మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల గౌరవ అధ్యక్షుడిగా అల్లంకొండ భీమన్న, మండల...