తుఫాన్ అనంతరం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రభుత్వ నిరంతర కృషి సీఎం చంద్రబాబు

అమరావతి,అర్జున్ సమాచారం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొగల్తూరు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందు మరోసారి సమీక్షించారు. విద్యుత్, రహదారులు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో పురోగతిని అధికారులు వివరించారు. విద్యుత్ పునరుద్దరణలో ఇతర రాష్ట్రాల నుంచి సహకారం తీసుకుని పనులు వేగవంతం చేసారు. ఇంకా ఇబ్బందులున్న ప్రాంతాల్లో  పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. చివరి వ్యక్తికీ సహాయం అందే వరకూ విశ్రమించేది లేదని  చంద్రబాబు అన్నారు. ప్రతిశాఖలో గ్రామ స్థాయిలో జరుగుతోన్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. చివరి వ్యక్తికి సహాయం అందే వరకు, సమస్యలు పూర్తిగా...