తూప్రాన్‌లో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్.. 450కి పైగా ఇళ్లలో తనిఖీలు, పత్రాలు లేని 64 వాహనాలు స్వాధీనం

మెదక్.అర్జున్ సమాచారం: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా తూప్రాన్ పట్టణంలోని 2 బీహెచ్ కె కాలనీలో ఈరోజు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ  విక్రాంత్ కుమార్ సింగ్,  ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (కార్డన్ సెర్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 105 మంది పోలీసు సిబ్బంది పాల్గొని 450కు పైగా ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 3 త్రిచక్ర వాహనాలు (మొత్తం 64) స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల ఉనికిని గుర్తించేందుకు నార్కోటిక్ డాగ్...