తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు అమెరికాలోని వైనరీని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వైనరీల ఏర్పాటుకు అవకాశం ద్రాక్ష రైతులకు ప్రోత్సాహం.. స్థానికంగా ఉపాధి అవకాశాలు
అర్జున్ సమాచారం: తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని మంత్రి సందర్శించారు. సెల్లార్ టూర్‌లో పాల్గొని వైనరీ నిర్వహణ, వైన్ తయారీ ప్రక్రియను అధ్యయనం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని అష్‌బర్న్‌లో ఉన్న ఓ వైనరీని మంత్రి సందర్శించి, అక్కడి నిర్వహణ, వైన్ తయారీ విధానాలను అధ్యయనం చేశారు. వైనరీ ప్రతినిధులతో మాట్లాడి...