తెలంగాణ కాషాయం పార్టీలో భారీ మార్పులు

హైదరాబాద్, జులై 1,అర్జున్ సమాచారం: భారతీయ జనతా పార్టీలో త్వరలోనే భారీ స్థాయిలో మార్పులు జరగనున్నట్టు సమాచారం. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ మార్పులు చేయనుండగా తెలంగాణలోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఈ మే-రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ ముఖ్య నేతలకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా జూలైలో మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ నాయకులు సైతం చెబుతున్నారు. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు...