తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లు ప్రారంభించిన సీపీ

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంతో పాటు నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ఔట్‌పోస్ట్ బూత్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...