ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 7:29 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తెలంగాణ పోలీస్ మీట్ స్పోర్ట్స్ లో రాణించిన శ్రీలత…. మూడు పతకాలు సాధింపు…

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
ఆమె పాల్గొంటే చాలు పతకం రావాల్సిందే.
హైదరాబాద్ లోని మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఈనెల 7 నుండి 9 వరకు జరిగిన ఐదవ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో మహిళ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కూరపాటి శ్రీలత మూడు పతకాలను సాధించింది. ఇందులో కాలేశ్వరం జోన్ నుండి రామగుండం కమిషనరేట్  గోదావరిఖని టూ టౌన్ పరిధిలోగల కమాన్ పూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కూరపాటి శ్రీలత యోగ ట్రెడిషనల్  లో గోల్డ్ మెడల్ ,యోగ ఆర్టిస్ట్ సింగిల్ లో సిల్వర్ మెడల్, యోగ రిత్విక్ పేర్ లో బ్రాంజ్ మెడల్, అలాగే యోగా ఆర్టిస్ట్ ఫెయిర్ మరొక బ్రాండ్ మెడల్ సాధించారు. ఇందులో కాలేశ్వరం జోన్ రాజన్న సిరిసిల్ల జోన్ భద్రాద్రి కొత్తగూడెం బాసర జోన్ యాదాద్రి జోన్ చార్మినార్ జోన్ జోగులాంబ జోన్ నుండి పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు. పతకాలు సాధించిన వారికి మల్కాజ్గిరి పోలీస్ అధికారులు మెడల్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీలత గతంలో హర్యానాలో జరిగిన జాతీయస్థాయి పోలీస్ మీట్ లో రాణించి బ్రాంచ్ పథకాన్ని సాధించారు. పత కాలు సాధించిన సాధించిన శ్రీలతను పలువురు అభినందించారు.
============================